Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమై

Advertiesment
అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని
, శనివారం, 28 అక్టోబరు 2017 (11:41 IST)
మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమైన చర్య అనీ, దారుణమైనదని అన్నారు. 
 
ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభ్యంతరకరమని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లపై నియంత్రణ విధించాలని ఆమె కోరినట్లు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న అత్యాచారాలను ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో దర్శనమివ్వడం ఎక్కువైంది. ఈ మాధ్యమాల ద్వారా అత్యాచారం దృశ్యాలను షేర్ చేయడంపై నిరోధించాలని నన్నపనేని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట : వరల్డ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి