Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. కోసేస్తారేమో... డీఎస్పీ ఎదుట లొంగిపోయిన గ్యాంగ్ రేప్ నిందితులు

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన సంచలన వ్యాఖ్యలతో నలుగురు అత్యాచార నిందితులు డీఎస్పీ ఎదుట లొంగిపోయారు. అమ్మాయిలు, మహిళలు రక్షణగా తమ వెంట కత్తులు, చాకులు పెట్టుకోవాలంటూ, అత్యాచారా

Advertiesment
వామ్మో.. కోసేస్తారేమో... డీఎస్పీ ఎదుట లొంగిపోయిన గ్యాంగ్ రేప్ నిందితులు
, బుధవారం, 24 మే 2017 (16:19 IST)
ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన సంచలన వ్యాఖ్యలతో నలుగురు అత్యాచార నిందితులు డీఎస్పీ ఎదుట లొంగిపోయారు. అమ్మాయిలు, మహిళలు రక్షణగా తమ వెంట కత్తులు, చాకులు పెట్టుకోవాలంటూ, అత్యాచారానికి పాల్పడే కామాంధుల మర్మాంగాలు కోసెయ్యాలంటూ మహిళా లోకానికి నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చింది. ఆమె ఈ తరహా పిలుపునిచ్చిన కొన్ని క్షణాల్లోనే అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
అంతకుముందు వైజాగ్ అత్యాచార బాధితులను పరామర్శించిన నన్నపనేని రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ... ఇంట్లో నుంచి బయటకు వెళ్లేట‌ప్పుడు అమ్మాయిలు తమ వెంట క‌త్తులు, చాకులు వెంట‌పెట్టుకుని వెళ్లాల‌ని సూచించారు. అంతేకాకుండా, కామంతో కళ్లుమూసుకునిపోయి అత్యాచారానికి పాల్పడే పురుషుల మర్మాంగాలను కోసెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
విశాఖపట్టణంలో అత్యాచార బాధితులను ఆమె బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలు, మహిళలు తమ రక్షణార్థం కత్తులు, చాకులు తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ పురుషులు ఎవరైనా అత్యాచానికి ప్రయత్నిస్తే వారి మర్మాంగాన్ని కోసిపారెయ్యాలని ఆమె సూచించారు. 
 
కేర‌ళ‌లో ఓ అమ్మాయి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్న‌ ఓ బాబా మ‌ర్మాంగాన్ని కోసేసింద‌ని, ఆ రాష్ట్ర సీఎం ఆమెపై కేసు లేకుండా చేశార‌ని గుర్తు చేశారు. త‌మ వెంట‌ప‌డి అకృత్యాల‌కు పాల్ప‌డే వారి పట్ల అమ్మాయిలు ఆ కేరళ యువతిలాగే ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సోష‌ల్ మీడియాలో అబ్బాయిల‌తో ప‌రిచ‌యాలు పెంచుకొని మోసపోవ‌ద్ద‌ని హితవు పలికారు. త‌మ వెంట ప‌డే వారిపై మాత్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి, ఎదురుతిర‌గాల‌ని నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో ఐతే సరే.. ఆంధ్రలో అయితే ఊచలు లెక్కెట్టవలసిందే..