Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట : వరల్డ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి

ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన బృహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాను ప్రారంభించడం. సున్నా నగదు నిల్వతో ఈ ఖాతాలను ప్రారంభించడం జరిగింది. జన్‌ధన్ పేరుతో ఏర్పాటు చ

Advertiesment
జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట : వరల్డ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి
, శనివారం, 28 అక్టోబరు 2017 (11:40 IST)
ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన బృహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాను ప్రారంభించడం. సున్నా నగదు నిల్వతో ఈ ఖాతాలను ప్రారంభించడం జరిగింది. జన్‌ధన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఖాతాలు ప్రతి ఒక్కరూ కలిగివున్నారని చెప్పొచ్చారు. 
 
అయితే, జన్‌ధన్‌ ఖాతాను ప్రారంభించడం వెనుక అసలు ఉద్దేశ్యాన్ని ప్రజలు వెల్లడిస్తున్నారు. ఈ ఖాతను కలిగివుంటే అలవోకగా నగదు బోనస్‌ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 31 శాతం మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బీహార్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13 శాతం మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్ ‌(31శాతం), బీహార్ ‌(46 శాతం) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. 
 
ఈ ఖాతా తెరిచిన వెంటనే బోనస్‌ పడుతుందని భావిస్తే, మరికొందరు దీనిద్వారా లభించే ఓవర్‌డ్రాఫ్ట్‌ను వెనక్కు ఇవ్వనవసరంలేదని భావించారు. ఇంకొందరు విదేశాల నుంచి వెలికితీసే నల్లధనాన్ని ప్రభుత్వం తమ ఖాతాల్లో వేస్తుందని ఆశించారు. ఇలాంటి అంచనాలతోనే చాలామంది ఖాతాలు తెరిచినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఖాతాదారులకు రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ ‌(ఓడీ) ఇస్తారన్న ఉద్దేశంతోనే ఖాతా తెరిచినట్లు మహారాష్ట్రలో 25 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...