కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణాకు 12, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 వైద్య కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటితో కలుపుకుని దేశ వ్యాప్తంగా 50 వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఒకే చెప్పింది.
ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త వైద్య కాలేజీల్లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటుకానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిశాఖ తెలిపింది.
అదేవిధంగా, తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.
మేడ్చల్-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్, మేడ్చల్‌లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలల ఏర్పాటు కానున్నాయి. మిగిలిని అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.