Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు భాగ్యనగరిలో జీరో షాడో డే... మాయం కానున్న 'నీడ'

zero shado day
, మంగళవారం, 9 మే 2023 (10:59 IST)
హైదరాబాద్ నగరంలో రెండు నిమిషాల పాటు నీడ మాయం కానుంది. దీన్నే జీరో షాడో అంటారు. భాగ్యనగరిలో 12.12 గంట నుంచి 12.14 గంటల వరకు ఈ జీరో షాడో ఆవిష్కృతంకానుంది. అంటే రెండు నిమిషాల పాటు ఈ నీడ మాయంకానుంది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని, దీన్నే జీరో షాడో అంటారని శాస్త్రవేత్తలు వివరించారు. 
 
ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్‌ సెంటర్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రోజూ సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టు కన్పిస్తున్నా జీరో షాడో ఉండదని అధికారులు తెలిపారు. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు మధ్యాహ్నం భూమధ్యరేఖపై మాత్రమే పడతాయి. దానికి ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవు అని వివరించారు.
 
సూర్యుని గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా, దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉండటంతో భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తలమీద నుంచి వెళ్తాడని వివరించారు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణం 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి