Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వెనకడుగు లేదు.. కేంద్రం స్పష్టీకరణ

vizag steel plant
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (17:14 IST)
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అలాగే, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని పేర్కొంది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.
 
అయితే, ఇప్పటికిప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేయాలని కేంద్రం భావించడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ గురువారం విలేకరులతో అన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంటు పనిచేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. 
 
ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత కార్మికులు, తదితరులతో జరిగిన భేటీల్లో ఆయన ఈ విషయంపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రకరకాల చర్చలకు తెరలేచింది. ఈ క్రమంలోనే ప్రైవేటీకరణపై కేంద్రం తాజాగా స్పష్టతనిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు : మంత్రి కేటీఆర్