విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం స్పందిస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయడం లేదని చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇప్పటికిపుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదన్నారు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదన్నారు. దానికంటే ముందు రాష్ట్రీస ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం.
ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టిపెట్టాం. పూర్తి స్థాయి సామర్థఅయం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతుంది. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్య, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్ఐఎన్ఎల్ అధికారులతో భేటీ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమే అని చెప్పారు.