Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా జెడ్పీ పీఠం కోసం సంకుల స‌మ‌రం... చివ‌రికి ద‌క్కేది ఎవ‌రికో!

Advertiesment
కృష్ణా జెడ్పీ పీఠం కోసం సంకుల స‌మ‌రం... చివ‌రికి ద‌క్కేది ఎవ‌రికో!
విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన కృష్ణా జిల్లా ప‌రిష‌త్ పీఠం కోసం సంకుల స‌మ‌రం జ‌రుగుతోంది. చివ‌రికి జెడ్పీ పీఠం ఎవ‌రికి ద‌క్కేది తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 
 
నిన్నటి మొన్నటి వరకు జడ్పీ చైర్మన్ పీఠం నాదేనన్న 'ఉప్పాలస‌కు ఇపుడు పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా తెర మీదకు 'దుట్టాస రామ‌చంద్ర‌రావు కుటుంబం వ‌చ్చేసింది. 
 
జనరల్ మహిళకు రిజర్వయిన చైర్మన్ పీఠంపై బీసీ మహిళను ఎలా కూర్చోబెడతార‌ని ఆ వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. కాపు మహిళను ఆ సీటులో కూర్చోబెట్టేందుకు ఆ వ‌ర్గం నేత‌లు పావులు కదుపుతున్నారు. ఆఘమేఘాల మీద సీఎం జగన్ ను 'ఉప్పాల' కుటుంబం క‌లిసింది. అయితే, జడ్పీ పీఠం నీదేనని సీఎం జగన్ నుండి హామీ మాత్రం ద‌క్క‌లేదు. చూద్దాంలే అన్న మాటతో గందరగోళంలో పడ్డారు 'ఉప్పాల కుటుంబ స‌భ్యులు. 
 
ఈ రాజ‌కీయ ప‌రిణామాల‌తో నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం నాదేనన్న ఉప్పాల కుటుంబం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. చైర్మన్ పీఠం కోసం మరో కుటుంబం తెర మీదకు రావ‌డంతో వారు హ‌తాశుల‌య్యారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు డా. దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతామహాలక్ష్మి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.
 
ఉంగుటూరు జడ్పీటీసీగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెడన నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారిక గుడ్లవల్లేరు జడ్పీటీసీగా విజయం సాధించారు. తొలి నుండి జడ్పీ చైర్మన్ పీఠం మాదే అన్న రీతిలో ఉప్పాల కుటుంబం ఎన్నికల ప్రచారం చేసి ఘన విజయం సాధించింది. అధిష్టానం కూడా ఉప్పాల కుటుంబానికే అన్నట్టు పరోక్షంగా చెప్పుకొచ్చింది. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠాన్ని బీసీలకు ఇవ్వడమేమిటన్న ప్రశ్న వైసీపీ కాపు నేతల నుండి అంతర్గతంగా వినిపించింది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన దుట్టా రామచంద్రరావు కుమార్తె సీతా మహాలక్ష్మికి చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పావులు కదిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉప్పాల రాంప్రసాద్ తన కోడలు హారికను తీసుకుని ఉన్న పళంగా సీఎం జగన్ ను కలిశారు. అయితే సీఎం జగన్ నుండి ఉప్పాల కుటుంబానికి స్పష్టమైన హామీ లభించలేదు. రాంప్రసాద్ సీఎంను కలిసిన సందర్భంలో సీఎం జగన్, తొలిగా జడ్పీ చైర్మన్ పదవి వేరొకరికి ఇస్తానని మాట ఇచ్చానని, ఎమ్మెల్సీ పదవి తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే దీనికి రాంప్రసాద్ ససేమిరా అన్నారు. తమకి జడ్పీ చైర్మన్ పదవే కావాలని సీఎం వద్ద పట్టుబడినట్టు సమాచారం.
 
చివరాకకు ఎదో ఒకటి చేద్దాంలే అన్న సమాధానం తప్ప, సీఎం జగన్ నుండి ఉప్పాల కుటుంబానికి స్పష్టమైన హామీ లభించ లేదు.  దీంతో ఉప్పాల కుటుంబం గందరగోళంలో పడింది. జడ్పీ చైర్మన్ పదవి ఎవరికనేది అధిష్టానం నేడో రేపో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే.. భర్త వీడియో తీశాడు..?