Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

59వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోనలు

59వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోనలు
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:48 IST)
అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 59వ రోజు మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు.

అటు వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లతో పాటు ఇంటి శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ ఉద్యమ నినాదం వినిపిస్తోంది. మూడు రాజధానులు వద్దు...అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. 
 
తాడేపల్లిలో పంచాయతీల విలీనంపై స్టే
గుంటూరు జిల్లా తాడేపల్లి పురపాలక సంఘంలో పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం, మల్లెంపూడి, చిర్రావూరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది.

అదేవిధంగా తదుపరి చర్యలన్నింటిపైనా స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

పైన పేర్కొన్న 8 పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత 6వ తేదీన జీవో 97ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ అలా కోరడం సరి కాదు: సీబీఐ