Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్ల అవకతవకలు

Advertiesment
Rs.2000 crore
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:09 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఐటీ సోదాల గురించి ఆదాయపు పన్నుల శాఖ ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఐటీశాఖ అధికారులు పేర్కొన్నారు.

విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లోని 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఏపీ, తెలంగాణలోని 3 ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించామని, మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించినట్లు తెలిపింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చేసిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయని, లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల ఆభరణాలు లభ్యమయ్యాయని, పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ ఒత్తిళ్లతోనే సస్పెండ్‌.. క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు