Publish Date: Thu, 07 Jan 2021 (11:52 IST)
Updated Date: Thu, 07 Jan 2021 (11:53 IST)
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 387వ రోజుకు చేరుకున్నాయి.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం,ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.