Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి అవంతి ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?: మంతెన సత్యనారాయణరాజు

మంత్రి అవంతి ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?: మంతెన సత్యనారాయణరాజు
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:44 IST)
16 నెలల కాలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నిలదీశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలిలా వున్నాయి.
 
"ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు నాయుడిని, టీడీపీని తిడుతూ కాలం గడిపారు తప్ప ఆయన మంత్రిగా రాష్ట్రానికిగానీ, తన నియోజకవర్గానికి చేసింది శూన్యం. పర్యాటక శాఖ, క్రీడాశాఖ మంత్రిగా 16 నెలల కాలంలో ప్రజలకు ఏం చేశారో అవంతి చెప్పగలరా? అవంతి తన చేతికానితనంతో రాష్ట్ర పర్యాటకరంగానికి ప్రాధాన్యత లేకుండా చేశారు.

టీడీపీ హయాంలో విశాఖను క్రీడాహబ్ గా తీర్చిదిద్దాం.  టీడీపీ హయాంలో విశాఖ ఆగనంపూడిలో మల్జీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు కేటాయించిన 150 ఎకరాల స్థలం రద్దు చేస్తూ  వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విశాఖకు చెందిన వాసిగా, క్రీడాశాఖ మంత్రిగా ఉన్న అవంతి కనీసం నోరుమెదపకపోవటం సిగ్గుచేటు. 

పర్యాటకరంగాన్ని, క్రీడాశాఖని అవంతి గాలికొదిలి భూకజ్జాలు, భూటకపు మాటలతో కాలక్షేపం చేస్తున్నారు.
 వైసీపీలో చేరిన అవంతికి నామమాత్రంగా మంత్రి పదవి ఇచ్చారు తప్ప, పార్టీలో గానీ, ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

తాను లోకల్ మంత్రి అయినప్పటికీ  విశాఖలో అంతా విజయసాయిరెడ్డి పెత్తనమే సాగుతోందన్న  ప్రస్టేషన్ లో మంత్రి అవంతి ఉన్నారు. ముఖ్యమంత్రి  జగన్ విశాఖ ఎప్పుడొచ్చినా అన్ని తానై ఏర్పాట్లు చూసినా జగన్  అవంతిని ఈవెంట్ మేనేజర్ పాత్రకే పరిమితం చేసి,  విజయసాయిరెడ్డికి విశాఖలో సర్వాధికారాలిచ్చారు.

అందుకే చంద్రబాబును తిట్టి జగన్ దృష్టిలో పడాలని అవంతి భావిస్తున్నారు. ఏపార్టీలోనైనా పనితీరు బాగుంటే ప్రాధాన్యత ఇస్తారు తప్ప పనికిమాలిన వాగుడు వాగితే కాదని అవంతి గుర్తెరగాలి. భూ కజ్జాలలో అవంతి, విజయసాయిరెడ్డి పోటీ పడుతున్నారు. విశాఖలో జరుగుతున్న భూకజ్జాలలో అవంతి పాత్ర కూడా ఉంది.

విశాఖ వైసీపీ విజయసాయిరెడ్డి వర్గం, అవంతి వర్గంగా చీలిపోయి ఎవరికి వారు భూకజ్జాలు చేస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అందుకే మొన్న వైసీపీ నాయకుడు కొయ్యా ప్రసాధరెడ్డి భూ కజ్జాల బాగోతం వెలుగులోకి వచ్చింది.

దీని వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారో, అవంతి ఉన్నారో త్వరలో బయటపడుతుంది.  అవంతి ఇకనైనా భూకజ్జాలు చేయటం, బూటకపు మాటలు చెప్పటం మానుకుని మానుకుని మంత్రిగా తన పనితీరు మెరుగుపర్చుకోవాలి" అని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిఆర్ఎస్ నేతల ఆశీస్సులతోనే ఆక్రమణలు: సిపిఐ నారాయణ