Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిపై అభివృధ్ది చేసే బాధ్యత మాదే : మంత్రి అవంతి

అమరావతిపై అభివృధ్ది చేసే బాధ్యత మాదే : మంత్రి అవంతి
, సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:12 IST)
అమరావతిపై అభివృధ్ది చేసే బాధ్యత తమదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. విశాఖజిల్లాపై టిడిపి నేతలు కక్ష కట్టారని ఆరోపించారు. 
 
కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైయస్ జగన్ వెంటే ఉన్నారు. పేదప్రజలకు ఇవ్వడానికే భూములు సేకరిస్తున్నాం. మా పార్టీలో సూపర్ సిఎంలు ఎవరూ లేరు. అన్ని ప్రాంతాల అభివృధ్దికి టీడిపి అడ్డుపడుతోంది.
 
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వద్దనుకుంటే మీ(టిడిపి) నలుగురు విశాఖఎంఎల్ ఏలతో రాజీనామా చేయించగలవా. అవినీతిపై యుధ్దం చేస్తుంటే టిడిపికి భయం పట్టుకుంది. ఉగాదికి 25 లక్షల ఇళ్లపట్టాలు ఇస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లో పూర్తి చేశాం.
 
టిడిపి నేతలు రోజుకో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. విశాఖలో ల్యాండ్ మాఫియాను పూర్తిగా కంట్రోల్ చేశాం. విశాఖలో టిడిపి నేతల భూదాహానికి అడ్డేలేదు. ఆక్రమణలు, భూకభ్జాల విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని వైయస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
 
అవినీతిరహిత పాలన అందించాలనేదే వైయస్ జగన్ లక్ష్యం. అభివృధ్ది వికేంద్రీకరణతో రాష్ట్రఅభివృధ్ది సాధ్యం. గ్రాఫిక్స్‌తో మేం మాయ చేయడం లేదు. పూటకోమాట చెప్పి చంద్రబాబు చివరికి చేతులెత్తేశారు. ఇలాంటి కుట్రలు చేస్తే చివరకు ఆ 23 సీట్లు కూడా రావు. ఉత్తరాంధ్రకు టిడిపి చేసిందేమి లేదు. ఆసియాలో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. భీమిలిలో గజం స్దలం కూడా కబ్జా కాలేదు అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త బియ్యం కార్డుల ముద్రణ పూర్తి