Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ - కరోనా మరణాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

కరోనా వైరస్ - కరోనా మరణాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:26 IST)
కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో కోవిడ్ పోజటివ్ కేసులు నియంత్రించే విధంగా వర్తక వాణిజ్య సముదాయాలను నిర్ణీత సమయాల్లోనే వినియోగదారులకు అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ డివిజన్ స్థాయి అధికారులను ఆదేశారించారు. 
 
గురువారం కోవిడ్ కేర్ సెంటరు పరిశీలన అనంతరం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కమీషనర్ ఛాంబరులో కరోనా నియంత్రణపై చేపట్టాల్సిన అంశాలపై ఆర్డీవో, డిఎస్పీ, మున్సిపల్ కమీషనరు, తాహశీల్ధారు తో చర్చించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కోవిడ్ కేసులు కట్టడి చేసే విధంగా వర్తక, వాణిజ్య వ్యాపారులుతో సమీక్షించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు వరకే అనుమతిని కేటాయించాలన్నారు. అదేవిధంగా రహదారులపై అనవసరంగా మాస్కులు లేకుండా ఎవరు తిరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో కోవిడ్ పాజటివ్ కేసులు పెగడటంతో పాటు మరణాలు సంఖ్య కూడా పెరుగుతుందని దీనిని అరికట్టేందుకు కోవిడ్ నియంత్రణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 
 
వర్తక, వాణిజ్య సమదాయాయలు, కిరాణాషాపుల్లో వినియోగదారులు కోవిడ్ నిబంధలను పాటించే విధంగా వర్తకులకు అవగాహన కల్పించాలన్నారు. మచిలీపట్నం లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్పూను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమీషనరు కలెక్టరు దృష్టికితీసుకురాగా, గుడివాడడివిజన్ స్థాయి అధికారులు రాష్ట్ర పౌరసరఫరాలు  శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో టాస్కపోర్సు సమావేశాన్ని నిర్వహించి తగు నిర్ణయం తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. 
 
గుడివాడ లో రేపటి నుంచి ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ సెంటర్ లో మౌలిక వసతులు, ఆక్సిజన్, వెంటిలేటర్సు ఇతర అంశాలకు సంబందించి ఆర్డీవో శ్రీనుకుమార్, మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, తాహశీల్థారు శ్రీ నివాసరావు సమన్వయంతో ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేయాన్నారు. “ స్టేహోం స్టే సేఫ్” అనే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 
 
జిల్లాలో ప్రజలకు 104 ద్వారా కోవిడ్ సమాచారాన్ని24 గంటలు అందిస్తున్నామని ఇందుకొరకు 3 షిప్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. 104 సేవలకు మంచి స్పందన వస్తుందన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్, డిఓస్పీ సత్యానందం, మున్సిపల్ కమీషనరు సంపత్ కుమార్, తాహశీల్తారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటిచ్చిన రెండు రోజుల్లోనే గుడివాడలో ఆస్పత్రిలో పడకల పెంపు!