బ్రిటిషర్ల కాలం నాటి రిజర్వాయర్ కడప జిల్లాలో బయటపడింది. కడప ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1890లో సంప్‌లా దీనిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం కూడా కనిపించింది. ఇన్నాళ్లు మరుగున పడిపోయిన ఆ రిజర్వాయర్ ప్రస్తుతంవెలుగులోకి వచ్చింది.
నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలోని బుగ్గ అగ్రహారంలో దీనిని గుర్తించారు. పొలాల మధ్యలో ఉన్న దీనిపై రెండు అడుగుల వెడల్పుతో 8 రంధ్రాలున్నాయి. దీంతో లోపలికి దిగి పరిశీలించగా 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా ఉంది