Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైకిల్‌ కు దూరంగా పోతుల?

సైకిల్‌ కు దూరంగా పోతుల?
, బుధవారం, 30 అక్టోబరు 2019 (07:58 IST)
కందుకూరు శాసనసభా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు పోతుల రామరావు మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్నట్లు కనిపి స్తోంది.

గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో ఈ అనుమానాలు చెలరేగుతున్నాయి. శాసనసభ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం పలు అంశాలపై నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఈ మధ్య ఇసుక లభ్యత లేకపోవడంపై నిరసనలు వ్యక్తంచేయాని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంతకు ముందు పల్నాడు సీమలో సమస్యలపై ఇలాంటి పిలుపునిచ్చారు. ఏ పిలుపుకూ పోతుల రామారావు స్పందించలేదు.

ఆయా సందర్భాల్లో నియోజకవర్గ కేంద్రానికి రావడం కాని, ఏదోఒకటి చేయడం కాని జరగడం లేదు. దీనికితోడు మండల కేంద్రమైన ఉలవపాడులో సుమారు నెల రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మండల సమావేశానికి పోతుల వెళ్ళలేదు.

అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన కొదరి ఇళ్ళలో శుభకార్యాలకు ఆయన హాజరవుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమం అంటూ చేపట్టడం లేదు. అంతేగాక నియోజకవర్గ కేంద్రమైన కందుకూరులో పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్ణయించడం లేదు.

శాసనసభ ఎన్నికల సమయంలో కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులోని ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అలాగే మండల కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలు నడిచాయి. ఆ తరువాత అవన్నీ మూత పడ్డాయి. ఎన్నికలకు నెలరోజుల ముందు వరకు కందుకూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు తన సొంత భవనంలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహించేవారు.

ఎన్నికల పార్టీ కార్యాలయం ఏర్పాటుతో ఆయన ఆ కార్యాలయాన్ని మూసివేశారు. మరోవైపు పోతుల రామారావు రాజకీయ ఆలోచనలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పోతుల ఫలానా పార్టీలో చేరుతున్నారంటే… కాదు మరో పార్టీలో చేరుతున్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే పోతుల రాజకీయంపై అనుమనాలు వస్తున్నాయి. పోతుల ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికాదు.

పూర్వాశ్రమంలో ఆయన కాంగ్రెస్‌వాది. కొండపి నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగానే గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో చివరి క్షణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్దిగా గెలిచారు. అయితే 2016లో పార్టీ ఫిరాయించారు.

అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అభ్యర్ధిగానే గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇందువల్లనే ప్రజల్లో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా… లేదా… అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎన్నికల తరువాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉటుండడంతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల్లో అత్యధికులు ఇప్పుడు ఆయన పట్ల కొంత విముఖంగానే ఉన్నారు. డిశంబర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సమయానికి పోతుల రామారావు వైఖరి స్పష్టమవుతుందని భావిస్తున్నారు.

డిశంబర్‌ 10 నుంచి మూడు రోజులపాటు ప్రకాశంజిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆ పర్యటనలో పోతుల రామారావు పాల్గొంటే ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారని భరోసా లభించవచ్చు. పోతుల రామారావు నియోజకవర్గ రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేకపోగా మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ దివి శివరాం మాత్రం అంతో… ఇంతో… పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు.

ఎక్కువ కాలం కందుకూరులో ఉంటున్నారు. తన వద్దకు కార్యకర్తలు తెస్తున్న సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే ఆయన కూడా పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకోవడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పోతుల రామరావు ఉండడంతో ఆయన లేకుండా, రాకుండా పార్టీ కార్యక్రమాలను తన భుజాన వేసుకుంటే బాగుండదని దివి శివరాం భావిస్తున్నారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 125 నాణెం విడుదల