పెహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశ వ్యాప్తంగా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని నిశితంగానూ, తనిఖీలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో చేపట్టిన తనిఖీల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే... కరడుగట్టిన సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగిన పదిమంది వ్యక్తులు విజయవాడలో తిష్ట వేసినట్లు సమాచారం.
వారిలో నలుగురు వ్యక్తులు భిక్షగాళ్ల రూపంలో వున్నారనీ, మరో ఆరుగురు వ్యక్తులు విజయవాడ శివారు ప్రాంతంలో వున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరుగురు చేతివృత్తులు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే ఈ విషయాన్ని పోలీసులు నిర్థారించటంలేదు. కానీ విజయవాడ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతూ ఇటీవల కొత్తగా వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం.