ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. జిల్లాల వారీగా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 6న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు నవంబర్ 7న, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.