విశాఖపట్నంలో తమ సరికొత్త యువి స్పేస్ స్టేషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అల్ట్రా వయోలెట్ తమ కార్యకలాపాలను ప్రారంభించింది, ఇది నగరానికి విప్లవాత్మక జోడింపుగా నిలుస్తుంది. ఈ సౌకర్యం అల్ట్రా వయోలెట్ విస్తరణ ప్రయాణంలో 6వ ప్రధాన మైలురాయిని సూచిస్తుంది, బెంగళూరులోని ఫ్లాగ్‌షిప్ సెంటర్‌తో ఇది చేరడంతో పాటుగా పూణే, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్‌లలో ఇటీవల ప్రారంభమైన అల్ట్రావయోలెట్ కార్యకలాపాలకు ఇది నూతన జోడింపుగా నిలుస్తుంది. ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి డజను నగరాల్లో తమ కార్యకలాపాలను సంస్థ ప్రారంభించనుంది.
విశాఖపట్నంలోని కొత్త యువి స్పేస్ స్టేషన్ అధిక-పనితీరు గల F77 MACH 2 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విస్తృత శ్రేణిలోని అభిమానులకు పరిచయం చేసింది, ఇది కీలక మార్కెట్‌లలోకి విస్తరించడం, 'డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్' అనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంకు అనుగుణంగా ఒక వ్యూహాత్మక దశను సూచిస్తుంది. విస్తృత శ్రేణిలో 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సదుపాయం పూర్తి 3ఎస్ కేంద్రంగా పనిచేస్తుంది, విక్రయాలు, సేవలు, విడిభాగాలను ఇది అందించనుంది- బెంగుళూరులోని అల్ట్రావయోలెట్ ప్రధాన కార్యాలయం నుండి అధునాతన డిజిటల్ డయాగ్నోస్టిక్స్, ప్రత్యక్ష సాంకేతిక మద్దతును సైతం కలిగి ఉంది.
F77 Mach 2 ఒక టాప్-టైర్ 10.3 kWh SRB7 లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది సాటిలేని పరిధి, పనితీరును అందిస్తుంది. ఆకట్టుకునే 8,00,000 కి.మీ బ్యాటరీ వారంటీతో-పరిశ్రమలో అత్యుత్తమమైనది-ఇది ఈవి సెక్టార్‌లో టెస్లా కంటే కూడా కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశించనుంది. అల్ట్రా వయోలెట్ యొక్క సీఈఓ-సహవ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, “విశాఖపట్నంలో యువి స్పేస్ స్టేషన్ ప్రారంభం అనేది చలనశీలత యొక్క భవిష్యత్తును పునర్నిర్మించే మా ప్రయాణంలో కీలకమైన ఘట్టం. నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలతో పాటుగా పట్టణ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో, విశాఖపట్నం మా విస్తరణకు అనువైన ప్రదేశంగా నిలుస్తుంది. ఈ కొత్త సదుపాయం ఆవిష్కరణ పట్ల మా నిబద్ధతను బలోపేతం చేయడమే కాకుండా, మొబిలిటీ పరంగా మరింత అనుసంధానించబడిన, స్వచ్ఛమైన, అధునాతన భవిష్యత్తు కోసం నగరం యొక్క దృష్టికి మద్దతు ఇస్తుంది. ఈ పరివర్తనకు సహకరించడానికి మేము సంతోషిస్తున్నాము, ఇక్కడ మా అత్యాధునిక సాంకేతికత, నగరం యొక్క భావి ప్రణాళికలను కలుస్తుంది" అని అన్నారు.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా 400 ఈవి ఛార్జింగ్ స్టేషన్‌లను ప్రణాళిక చేశారు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మోడల్ హబ్‌లుగా ఉంచడం ద్వారా ఈవి ఇంటిగ్రేషన్, గ్రీన్ మొబిలిటీని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యమవుతుంది.
అల్ట్రావయోలెట్ యొక్క సిటిఒ-సహ వ్యవస్థాపకుడు నిరాజ్ రాజ్మోహన్ మాట్లాడుతూ, “భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవంలో ముందంజలో ఉండటానికి సిద్ధంగా ఉన్న విశాఖపట్నంలో మేము కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వేళ, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికలకు అనుగుణంగా ఉండటానికి మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వడం, విశాఖపట్నంను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సిటీగా గుర్తించాలనే కేంద్రం కార్యక్రమం ఓ గేమ్ ఛేంజర్. ఈ అభివృద్ధి, ఫేమ్-II యొక్క ప్రారంభంతో పాటు, స్థిరమైన ఈవీ పర్యావరణ వ్యవస్థకు పునాదిని బలపరుస్తుంది. ఈ పరివర్తనలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము, విశాఖపట్నం భారతదేశం యొక్క గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా దానికి నాయకత్వం వహిస్తుందని నమ్ముతున్నాము" అని అన్నారు. ఈ అనుభవ కేంద్రం 50-61-4, డైమండ్ పార్క్ రోడ్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530016 వద్ద ఉంది.
పూర్తిగా ఊహించిన, రూపొందించబడిన, భారతదేశంలో తయారుచేయబడిన, F77 MACH 2 ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా ప్రారంభించబడిన యువి స్పేస్ స్టేషన్‌లో కొనుగోలు, టెస్ట్ రైడ్‌లకు అందుబాటులో ఉంది. ఈ సంచలనాత్మక మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా 2024 సీజన్‌లో అత్యధిక అవార్డులు పొందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా కూడా అవతరించింది, దాని అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన డిజైన్, అసమానమైన పనితీరు కోసం ప్రశంసలు అందుకుంది.