Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్కో చైర్మన్ చిల్లపల్లి కుమార్తె వివాహానికి సీఎం జగన్ రాక‌

Advertiesment
ఆప్కో చైర్మన్  చిల్లపల్లి కుమార్తె వివాహానికి సీఎం జగన్ రాక‌
విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (13:59 IST)
అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. చిల్లపల్లి వారి వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు లక్ష్మీప్రియాంక, పవన్ సాయి జంటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. పలువురు మంత్రులు, అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు చిల్లపల్లి వారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. 
 
 
మంగళగిరి సీకే కన్వెన్షన్ లో బుధవారం ఉదయం అట్టహాసంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, పద్మావతి దంపతుల కుమార్తె లక్ష్మీప్రియాంక, ప్రకాశం జిల్లా వాస్తవ్యులు గోలి తిరుపతి రావు, లక్ష్మి దంపతుల కుమారుడు పవన్ సాయిల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేయడం విశేషం. అలాగే చిల్లపల్లి వారి బంధువులు, సన్నిహితులు, రాష్ట్రంలోని చేనేత ప్రతినిధులు, ప్రత్యేకించి చిల్లపల్లి మోహనరావు చిన్ననాటి మిత్రబృందం సీకే హైస్కూల్ 1978-79 పదోబ్యాచ్ పూర్వవిద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు.
 
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న చిల్లపల్లి మోహనరావు.. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కేంద్రాల్లో పర్యటిస్తూ వైసీపీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రమశిక్షణ, అంకితభావం, చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధి కోసం మోహనరావు అహర్నిశలు శ్రమించి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరువయ్యారు. అలాగే పార్టీలో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి మన్ననలు పొంది సన్నిహితుడయ్యారు. చేనేత సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన మోహనరావుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వచ్చాక తగినరీతిలో గౌరవించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు : రీకౌంటింగ్‌లో తెదేపా అభ్యర్థి గెలుపు