చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ పలు ఘటనలు వెలుగుచూడగా తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
11వ వార్డులో కేవలం 06 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే మళ్లీ రీ కౌంటింగ్ జరపాల్సిందేనని.. ఈసారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరిపించారు.
అయితే ఈ రీ కౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి కస్తూరి గెలుపొందారు. ఇలా వైసీపీ రెండోసారికి పట్టుబట్టి మరీ పరువు తీసుకోగా.. టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే వైసీపీనే ఎక్కువ స్థానాల్లో గెలిచి నిలిచింది. టీడీపీ మాత్రం ఊహించని రీతిలో సీట్లకు పరిమితం కావడం గమనార్హం. తాజాగా ఆరో వార్డు నుంచి కూడా టీడీపీ అభ్యర్థే గెలుపొందారు.