ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం అధికారులు ప్రటించారు. తాజాగా గణాంకాల మేరకు ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279గా వుంది. ఇందులో మహిళా ఓటర్లు 2,05,97,544 అయితే, పురుష ఓటర్ల సంఖ్య 2,01,34,664గా వుంది. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,62,880 మంది ఎక్కువగా ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలో 7033 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు ఉండగా, 67935 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
ఈ ఓటర్లలో అత్యధికంగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 43,45,322 మంది ఉండగా, వీరిలో హిజ్రాలు 352 మంది ఉన్నారు. అతి తక్కువ మంది ఓటర్లు ఉన్న విజయనగరం జిల్లాలో మొత్తం ఓటర్లు 19,02,077గా ఉంటే, వీరిలో 9,38,743 మంది పురుషులు, 9,63,197 మహిళలు, 137 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అలాగే, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.