రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లలో 2,01,934 మంది రైతుల నుండి రూ. 4575.32 కోట్ల విలువైన 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యం (వరి) కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటలలోపు రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసింది. జూలై 10న, వరి కొనుగోలు బకాయిల చెల్లింపు కోసం 30,403 మంది రైతుల ఖాతాల్లో రూ. 659.39 కోట్లు జమ అయ్యాయి" అని మనోహప్ అన్నారు.
2024-2025 సంవత్సరానికి 2,01,934 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.4575.32 కోట్లు జమ కావడం దేశంలో ఇదే తొలిసారి అని మనోహర్ పేర్కొన్నారు. "పూర్తి చెల్లింపులు పూర్తయ్యాయి. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 5,65,662 మంది రైతుల నుండి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని నాదెండ్ల చెప్పారు.
దీని విలువ రూ.8282.27 కోట్లు. 24- 48 గంటల్లో 5,65,662 మంది రైతులకు మొత్తం రూ.8282.27 కోట్లు చెల్లించారు." ప్రభుత్వం 525 మంది రైతుల నుండి రూ.3.87 కోట్ల విలువైన 902 మెట్రిక్ టన్నుల రాగులు (ఫింగర్ మిల్లెట్) సేకరించిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు, 502 మంది రైతులకు మొత్తం రూ.3.26 కోట్లు చెల్లించామని నాదెండ్ల అన్నారు. గత ప్రభుత్వం చెల్లించని రూ.1674.47 కోట్ల మొత్తం ధాన్యం బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం 84,724 మంది రైతులకు పూర్తిగా చెల్లించిందని మంత్రి పేర్కొన్నారు. పనిలో పనిగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మామిడి పండ్లను ట్రాక్టర్లచే తొక్కించడంపై మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.