Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరికొన్ని గంటలే.. హీటెక్కిస్తున్న ఓట్ కౌంటింగ్.. అమరావతికి నేతల క్యూ

మరికొన్ని గంటలే.. హీటెక్కిస్తున్న ఓట్ కౌంటింగ్.. అమరావతికి నేతల క్యూ
, బుధవారం, 22 మే 2019 (14:37 IST)
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అంటే గురువారం ఉదయం 8 గటంలకు పోలింగ్ మొదలుకానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి క్యూకడుతున్నారు. 
 
ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి ట్రెండ్ ఏంటో తేలిపోనుంది. దీంతో రాజకీయ పార్టీల నేతలు, ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడనుంది. ట్రెండ్స్ ఏంటో తెలిసిపోయిన తర్వాత చంద్రబాబు సర్కారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకోనున్నారా? జనసేన కింగ్ మేకర్ అయ్యేనా? వంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఏపీ శాసనసభలోని 175 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే అన్ని రాజకీయ పార్టీల నేతలు అమరావతికి క్యూ కట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకుని, సమీక్షలు నిర్వహిస్తుండగా, బుధవారం సాయంత్రానికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. 
 
అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రేణిగుంటకు చేరుకుని అక్కడ నుంచి బెంగుళూరుకు వెళ్లి తిరిగి రాత్రికి అమరావతికి వస్తారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు..