ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పిఆర్సిఫై ఎన్జీవోలు రుస రుసలాడుతున్నారు. దీనికన్నా పాత పిఆర్సి చాలా బెటర్ అని దానిని అమలు చేయండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సిఫై అంతా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దీనిని రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఎపి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శిలు భూపతిరాజు రవీంద్ర రాజు, అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎన్జీవో నాయకులు సమావేశం అయ్యారు. వీరంతా కలిసి యూనియన్ నాయకులని దాదాపు నిలదసీనంత పని చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సి జీవో రద్దు చేసి, పాత పద్ధతిలోనే జీతాలు బిల్లులు అమలు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి, హెచ్.ఆర్.ఏ. విషయంలో అన్యాయం జరుగుతోందని, వెంటనే ప్రభుత్వం పునరాలోచించి కనీసం 30% ఫిట్మెంట్. ఇచ్చి. హెచ్. ఆర్ .ఎ. పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వం తరపున సి .యస్. కమిటీ ఇచ్చిన సిఫార్సులు నిలుపుదల చేసి, అసలు మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని ఉద్యోగులు డిమాండ్లి చేసారు. లేదంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్నికి సంబంధించి దశలవారీ ఉద్యమం చేపడతామని యూనియన్ లకు అతీతంగా నాయకులూ హెచ్చరించారు.