15న ఏపీ మంత్రి వర్గ సమావేశం.. మూడు రాజధానులపై నిర్ణయం తీసేసుకుంటారా?

శుక్రవారం, 10 జులై 2020 (16:47 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం ఈ నెల 15న సచివాలయంలో భేటీ కానుంది. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు ఈ నెల 14తో ఊపిరిలూదుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకం కానుందని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి వర్గ భేటీ జరగనుంది. దీనిలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
 
చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని రాజధానిలో టెన్షన్ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్