Publish Date: Sat, 19 Feb 2022 (15:09 IST)
Updated Date: Sat, 19 Feb 2022 (15:11 IST)
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామని బొత్స సవాల్ విసిరారు.
ఎన్నికల బహిష్కరణ అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స అన్నారు. ముందు ఓటమిని అంగీకరించడం టీడీపీ నేర్చుకోవాలని సూచించారు.
టీడీపీ నేతల మాటలు చూస్తుంటే వారికి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్న విషయం అర్థమవుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ పనైపోయిందన్న సంగతి స్పష్టమైందని, ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు.