Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

AP Land Titling Act-2023: ఆంధ్రప్రదేశ్ ప్రజల భూములు గల్లంతేనా?

Farmer

ఐవీఆర్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (21:35 IST)
జగన్ సీఎంగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022. ఈ చట్టం అక్టోబరు 31, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టంలోని అంశాలు చూస్తే షాకింగ్ అంటున్నారు న్యాయ నిపుణులు. ఈ చట్టం ప్రకారం ఆస్తి సర్వే చేసిన తర్వాత ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే అవుతుంది స్థలం, పొలం, ఇల్లు... ఇలా ఏదైనా ఆస్తి. ఈ విషయంలో ఏదైనా పొరబాటు జరిగినా మన ఆస్తి మరొకతడి పేరులో రాసి వున్నా... ఆ విషయంలో సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టులు ఏమీ చేయలేవు. ఈ సమస్యను కేవలం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మాత్రమే పరిష్కరిస్తారు. మరెవ్వరి చేతుల్లో వుండదు. ఒకవేళ సదరు అధికారి నిర్ణయం నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకోవాలి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక హైకోర్టే దిక్కు.
 
ఈ కొత్త చట్టంతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకేనన్న భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భూయాజమాన్య హక్కు చట్టం ప్రకారం  టీఆర్ఓ, ఎల్టీఓ అధికారులకే పూర్తి అధికారం వుంటుంది. రెవిన్యూ వ్యవస్థలో భూమికి సంబంధంచి కాళ్లరిగేలా తిరిగినా పనులు కావనే ఆరోపణలు వినిపిస్తూనే వుంటాయి. ఈ చట్టం అడ్డుపెట్టుకుని పేదలు, నిరక్షరాస్యుల భూములను లాక్కునే ప్రమాదం వుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు దస్తావేజులు స్థానంలో కేవలం క్జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. వీటిని తీసుకుని బ్యాంక్ లేదా ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకోవాలన్నా చెల్లదు. ఆస్తి ధృవీకరణ పత్రాన్ని కొత్త చట్టం ప్రకారం ఎంపిక చేసిన అధికారి చేత తీసుకుని చేయాల్సి వుంటుంది. కనుక ఇకపై ఏపీలో ఆస్తులకు అంత భద్రత వుండదనే వాదనలు వనిపిస్తున్నాయి. అంతేకాదు... తమ ఆస్తులపై కనీసం అప్పులు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా చేయబోతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాదులు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు