Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

Advertiesment
results

ఠాగూర్

, శనివారం, 12 ఏప్రియల్ 2025 (13:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా శనివారం రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికార https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌‌లో చూసుకోవచ్చని తెలిపారు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 హాయ్ అనే సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెప్పారు. 
 
ఇక ఈ యేడాది ఇంటర్ మొదట సంవత్సరంలో 70 శాతం, ద్వితీయ సంవత్సరం 83 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా, ప్రభుత్వం, ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలలో ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాంతి 10 శాతం సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్లకి కృషికి నిదర్శనం అని చెప్పారు. 
 
ఈ సారి పాస్‌ కానివారు నిరుత్సాహపడకుండా దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకుని మరింత కష్టపడి చదవాలని అన్నారు. విద్యార్థులు ఎపుడూ పోరాడటాన్ని ఆపకూడదని, విజయం కోసం ప్రయత్నించడంలో తప్పులేదని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ యేడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిసి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులకు పరీక్షలకు హాజరైన విజయం తెలిసిందే. 
 
ఫెయిలైన విద్యార్థులకు సిప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్ సిప్లమెంటరీ పరీక్షలు మే 28వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు. సిప్లమెంటరీ రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15 నుంచి 22 వరకు తేదీల మధ్య పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థుల ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవాలని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త