పిఆర్ సి కోసం ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులు, ఏపీ సీఎం జగన్ పైన ఇష్టానుసారం పాటలు పాడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. దీనికి రియాక్షన్ ఇప్పటికే మొదలైంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పని వేళల పై డేగ కన్ను పెట్టనుంది .బయో మెట్రిక్ విధానాన్ని రాబోవు మాసం లో పూర్తి స్థాయి లో అమలు చేయాలని నిర్ణయించారు. నిన్నటి ఉద్యమాన్ని చూసి ఉలిక్కి పడ్డ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది అని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.
దీని ప్రకారం రాబోవు నెల నుండి ఉపాధ్యాయుల బయో మెట్రిక్ హజరు కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిని గుంటూరు , కృష్ణా , నెల్లూరు , విజయనగరం స్వంత పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర ఒత్తిడి చేసినట్లు సమాచారం. చైనా కంపెనీ కి చెందిన Huai సంస్థ డివైజులను భారీ గా కొనుగోలు చేసి దానిని CFMS కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రాష్ట్రం లోని ఉపాధ్యాయుల పని వేళలను పర్యవేక్షణ చేస్తారు.
9 : 15 తరువాత హజరైన ఉపాధ్యాయులను లేట్ గా పరిగణిస్తారు. ఇటువంటి 3 లేట్ లకు ఒక పూర్తి సి.ఎల్. గా నిర్ణయిస్తారు. 9:30 తరువాత హజరైన ప్రతి సారి ఒక హాఫ్ డే సీఎల్ గా పరిగణిస్తారు.