Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు: వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం.. విలువ రూ.2కోట్లు

Diamond
, బుధవారం, 7 జూన్ 2023 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, దూకిలి, మహానంది, మహదేవపురం గ్రామాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పొలాల్లో వర్షాల తర్వాత వజ్రాలు లభించాయి. గతేడాది 2019లో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో లభించిన రూ.60 లక్షల విలువైన వజ్రాన్ని స్థానిక వ్యాపారికి మంచి మొత్తానికి విక్రయించాడు. 
 
2 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా రైతులు 2 ఖరీదైన వజ్రాలు కనుగొని మంచి మొత్తానికి విక్రయించినట్లు కూడా చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం దొరికింది. దానిని అనంతపురం జిల్లాలోని వజ్రాల వ్యాపారికి రూ.2 కోట్లకు విక్రయించి ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తున్నాయని ప్రచారం జరిగింది. 
 
దీంతో కర్నూలు జిల్లా రైతులు తమ రోజువారీ పనులను పక్కనబెట్టి కుటుంబ సమేతంగా పొలాల్లో రాత్రింబవళ్లు వేచి ఉన్నారు. అక్కడ తాత్కాలిక టెంట్లు వేసుకుని వజ్రాలు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దీనిపై సమాచారమందుకున్న రెవెన్యూశాఖ, జియోలాజికల్ సర్వేయర్లు వజ్రాలు లభించినట్లు చెబుతున్న గ్రామాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్