Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజధాని విశాఖకు తరలి వెళ్లడం తథ్యం : మాజీ మంత్రి కొడాలి నాని

Advertiesment
kodali nani
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:53 IST)
వైకాపా నేతలు మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని దెయ్యాల రాజధానిగా పోల్చారు. పైగా, త్వరలోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపానా రాజధాని (అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్)ను విశాఖపట్టణంకు తరలించడం ఖాయమని ప్రకటించారు. 
 
ఈ నెల 12వ తేదీన రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు మహాపాదయాత్రను చేపట్టనున్నారు. దీనికి ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కానీ, వైకాపా నేతలు మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
తొలుత మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అమ‌రావ‌తి రాజ‌ధానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌గా... తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన మాజీ మంత్రి కొడాలి నాని ప‌రిపాల‌న రాజ‌ధానిని వైజాగ్ తీసుకెళ్ల‌డం త‌థ్య‌మంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌తో పాటు న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలు, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి జ‌రిగి తీరుతాయ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.
 
అలాగే, మాజీ మంత్రి కొడాలి నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయ‌న్నారు. వైజాగ్‌లో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. విశాఖ‌లో కేవలం రూ.10 వేల కోట్లు పెడితే సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌న్నారు. 
 
అమ‌రావ‌తిని మ‌హా న‌గ‌రాల‌తో పోల్చి చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోపించారు. 29 నియోజ‌కవ‌ర్గాలు ఉన్న రాజ‌ధాని ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నించిన నాని... 29 గ్రామాలున్న అమ‌రావ‌తి ఎక్క‌డ అని వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని 23 సీట్ల‌కే ప‌రిమితం చేసినా చంద్ర‌బాబుకు బుద్ధి రాలేద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించిన లయన్‌ చార్జ్‌