Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు!!

Advertiesment
AP Election Commissioner
, శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఉద్వాసన పలుకనుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసి తీసుకున్న నిర్ణయాన్ని గతంలో ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది.  దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన విశేషాధికారాలను వినియోగించి ఎన్నికలను వాయిదా వేసినట్టు ఎన్నికల కమిషర్ గతంలోనే పేర్కొన్నారు.  
 
అయితే, తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరుతూ అయన ఏపీలో ఉండకుండా హైదరాబాద్ వచ్చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషర్ రమేష్‌కు ఉద్వాసన పలుకుతూ జీవో జారీ చేసింది. ఏపీ ఎన్నికల కమిషర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌పై జీవోను జారీ చేసింది. ప్రభుత్వానికి సంక్రమించిన అధికారంతో ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవోను జారీ చేసింది. అయితే, ఈ రెండు జీవోలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచడం గమనార్హం. 
 
అంతేకాకుండా, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎస్ఈసీ పదవీ కాలం, అర్హత, నియామక పద్ధతికి సంబంధించిన ఏపీ పంచాయతీ రాజ్ యాక్టు-1994ను ప్రభుత్వం సవరించనున్నట్టు సమాచారం. స్వతంత్ర, న్యాయమైన, తటస్థ వ్యక్తి ఈ పదవిలో ఉండేలా ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను తేనున్నట్టు తెలుస్తోంది.
 
దీని ప్రకారం హైకోర్టులో జడ్జిగా పని చేసిన వ్యక్తి మాత్రమే ఎస్ఈసీగా నియామకానికి అర్హులుగా ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాకు తక్కువకాని పదవిలో పనిచేసిన వారిని మాత్రమే ఎస్ఈసీ‌గా నియమిస్తున్నారు. అందువల్ల, బ్యూరోక్రాట్స్ మాత్రమే ఈ పదవికి అర్హులుగా ఉన్నారు.
 
ప్రతిపాదిత ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవీకాలాన్ని కూడా ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని చూస్తున్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది కానీ, అది ఆరేళ్లకు మాత్రం మించకూడదు. ఎస్ఈసీ జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ హైకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ ఎఫెక్ట్, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం, 800 మంది ఔట్