ఏపీ ఎస్డీ ఆర్ఎఫ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు. దేశంలోనే ఉత్తమైన ఎస్‌డిఆర్‌ఎఫ్‌గా ఆంధ్రప్రదేశ్ శాఖ సేవలను అందిస్తోందని ఆయన కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభించి ఇది 4వ సంవత్సరం. ప్రజల ప్రాణాలను విపత్కర పరిస్థితులలో కాపాడటానికి ఏపీ పోలీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. ఎస్ డిఆర్‌ఎఫ్ సిబ్బంది చక్కటి డెమో విన్యాసాన్ని ప్రదర్శించారు. ఏపీ ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 540మంది సిబ్బందిని జాతీయ స్థాయి శిక్షణ సంస్థ ద్వారా అత్యంత ఆధునిక అడ్వాన్స్ టెక్నాలజి వినియోగంలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు.
ఎపి లో ఆరు కంపెనీ లతో కూడిన 600 మంది పోలీస్ సిబ్బందితో ఎస్డీ ఆర్ఎఫ్ సేవలను అందిస్తోంది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా 12 బృందాలతో ఆరు ప్రాంతల కేంద్రంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మంగళగిరి, నెల్లూరు కర్నూలు సేవలను అందిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ చాలా బలపడింది.
ఏపీ ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయం తో కలిసి పని చేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పలు విపత్తులు, అగ్నిప్రమాదాల సమయంలో ఎస్.డి.ఆర్.ఎఫ్ బలగాలు విశిష్ఠ సేవల్ని అందించాయి. సమయానికి ప్రజల ప్రాణాలను కాపాడిన ఎస్డీ ఆర్ఎఫ్ బలగాలకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.