శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన రద్దు అయింది. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్ ఢిల్లీ రావాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.