Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీన 'అన్న' క్యాంటీన్లన

Advertiesment
Anna Canteens
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీన 'అన్న' క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పేదలకు అతి తక్కువ ధరకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
 
అలాగే, ఈ నెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభ వాయిదా పడిందన్నారు. ఇది వచ్చే నెల 10వ తేదీలోగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని, మే నెలలో జిల్లాల్లో మినీ మహానాడు సభలు నిర్వహిస్తామన్నారు. ఐదు రూపాయ‌ల‌కే పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం పెట్ట‌డం అంటే మంచి విష‌య‌మే. మ‌రి... ఈ అన్న క్యాంటీన్ల‌ను మొక్కుబ‌డిగా ప్రారంభించి వ‌దిలేస్తారో...? లేక మంచి క్వాలిటీతో పేద‌ల వారికి 5 రూపాయ‌ల‌కే క‌డుపు నింపుతారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు