మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. సరాదాగా సముద్ర తీరానికి గడిపేందుకు వెళ్లిన ఇద్దరు బీ ఫార్మసీ అమ్మాయిలు నీటమునిగి మృతిచెందిన దుర్ఘటన మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలోని విష్ణు కాలేజీలో కాకర ప్రమీల (22), కల్లేపల్లి పూజిత (22) చదువుతున్నారు. బి ఫార్మసీ చదువుతున్న ఈ ఇద్దరూ సరదాగా గడిపేందుకు మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే సముద్ర నీటిలోకి దిగిన ఇద్దరూ అలల తాకిడిలో లోతులోకి కొట్టుకుపోయారు.
అమ్మాయిలిద్దరూ కొట్టుకుపోవడాన్ని గమనించినవారు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతయిన అమ్మాయిలను ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అమ్మాయిలిద్దరూ అనస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఒడ్డుకు చేరిన కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
మైరైన్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో మచిలీపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అమ్మాయిలిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.