Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్... అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

payyavula

ఠాగూర్

, సోమవారం, 11 నవంబరు 2024 (09:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే పాలన సాగించింది. సోమవారం పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 
 
ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖ అధికారులు పీయూష్ కుమార్, జానకి, నివాస్ నుంచి బడ్జెట్ పత్రాలు అందుకున్న మంత్రి వాటికి పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా చెమటోడుస్తోంది. ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. బడ్జెట్‌పై తీవ్ర కసరత్తు చేసిన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిసింది. 
 
ముఖ్యంగా, ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా, సూపర్ సిక్స్ హామీలకు, పెన్షన్లు, దీపం 2.0, అన్న క్యాంటీన్ల పథకాలకు నిధులు కేటాయించినట్టు సమాచారం. అలాగే, నీటిపారుదల, రోడ్ల మరమ్మతులు, నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో పెద్ద పీట వేసినట్టు తెలిసింది.
 
అలాగే, పోలవరం, రాజధాని పనుల పునఃప్రారంభానికి నిధుల లేమి లేకుండా బడ్జెట్లో ఏర్పాట్లుచేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసంధానించి బడ్జెట్కు రూపకల్పన చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధుల కల్పన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపు చేపట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18న తితిదే పాలక మండలి భేటీ.. ఆడంబరాలకు దూరంగా చైర్మన్!!