Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18న తితిదే పాలక మండలి భేటీ.. ఆడంబరాలకు దూరంగా చైర్మన్!!

brnaidu

ఠాగూర్

, సోమవారం, 11 నవంబరు 2024 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త పాలక మండలి తొలి సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగనుంది. ఈ కొత్త పాలక మండలిలో 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించిన విషయం తెల్సిందే. తితిదే చైర్మన్‌‍గా టీవీ5 చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు)ను నియమించారు. ఈ నేపథ్యంలో తితిదే నూతన పాలకమండలి నవంబరు 18వ తేదీన తొలిసారి సమావేశంకానుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఉదయం 10.15 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ మేరకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 
 
మరోవైపు, తితిదే చైర్మన్‌‍గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. నిజానికి తితిదే బోర్డు చైర్మన్ అంటేనే హోదాకు నిదర్శనంగా అనేక మంది మాజీ చైర్మన్లు భావించారు. మరికొందరు ఆడంబరాలకు వెళ్లి తితిదే అందించే ప్రిమిలేజెస్‌ను అడ్డదిడ్డంగా వినియోగించుకున్నారు. కానీ, కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తితిదే అందించే వాహనాలు, వసతి సదుపాయాలను సున్నితంగా పక్కనపెట్టారు. ప్రమాణ స్వీకారం కోసం తిరుమలకు వచ్చిన ఆయన అక్కడ బస చేసినన్ని రోజులూ తన సొంత వాహనాలనే వినియోగించుకున్నారు. అలాగే, తనతో పాటు తన సహచరులు, కుటుంబ సభ్యులు ఉన్న వసతి గదుల అద్దెలు, భోజనం ఖర్చులను కూడా తానే భరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్