Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజధాని ప్రాంతం తుళ్లూరులో 90 శాతం పోలింగ్

Advertiesment
రాజధాని ప్రాంతం తుళ్లూరులో 90 శాతం పోలింగ్
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:14 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు. ఈ మండలంలో మొత్తం 47,304 ఓట్లు ఉన్నాయి. వీరిలో గురువారం జరిగిన పోలింగ్‌లో 42,576 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మండల వ్యాప్తంగా దాదాపుగా 90.2 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 
 
మండల కేంద్రం తుళ్లూరులో 88.5 శాతం ఓట్లు పోలయ్యాయి.. మేజర్‌ గ్రామమైన పెదపరిమిలో 86.66 శాతం ఓట్లు పోలయ్యాయి. రాయపూడిలో అత్యధికంగా 94 శాతం పోలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అలాగే, వెంకటపాలెంలో 91 శాతం ఓట్లు పోలైనట్టు తెలిపారు. 
 
ఈ మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయి. అయినప్పటికీ ఓటర్లు ఏమాత్రం విసుగు చెందకుండా క్యూలైన్లలో ఓపిగ్గా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, నవ్యాంధ్ర రాజధానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాడిస్ట్ భర్త... భార్యను కుక్కపిల్లతో శృంగారం చేయించాడు...