Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

schools
, ఆదివారం, 1 అక్టోబరు 2023 (14:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 13 రోజుల పాటు ఇవ్వనుంది. అక్టోబరు 13వ తేదీ నుంచి ఈ దసరా సెలవులు ఇస్తున్నారు. అక్టోబరు 25వ తేదీతో ముగుస్తాయి. 26వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అక్టోబరు 5 నుంచి 11వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షను నిర్వహిస్తారు. 8వ తరగతి విద్యార్థులు మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఈ మేరకు ఏపీ విద్యాశాఖ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 2023-24 అకడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పొందుపరిచారు. అదే విదంగా క్రిస్మస్ సెలవులు కూడా ఏడు నుంచి ఐదుకు తగ్గించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్స్, టీచర్ మీటింగులు నిర్వహిస్తారని ఆ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మేలుకో తెలుగోడా.." పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర