Publish Date: Sat, 13 Nov 2021 (16:37 IST)
Updated Date: Sat, 13 Nov 2021 (16:41 IST)
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన తర్వాత చేస్తూ ఇవాళ 200లోపే నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69, 614 కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 411 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3227 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 229 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 51, 976 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 33 , 362 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 99 , 17 , 592 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.