Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబును నమస్కరించిన రోబో.. ఎక్కడో తెలుసా? (video)

Advertiesment
Chandra Babu

సెల్వి

, గురువారం, 21 ఆగస్టు 2025 (10:53 IST)
Chandra Babu
ఏపీ సర్కార్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టెక్ పార్కులో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ ఆవిష్కరణలను పరిశీలించారు. 
 
ఈ క్రమంలో ఒక రోబో ఆయనకు అభివాదం చేస్తూ నమస్కరించింది. దానికి ప్రతిగా సీఎం చంద్రబాబు కూడా ఆ రోబోకు నమస్కరించారు. ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన వెంటనే, చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ టెక్నాలజీ ప్రదర్శనలను పరిశీలించారు. 
 
ఈ దృశ్యం అక్కడున్న వారికి షాక్ ఇచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో కొత్త సాంకేతికతలు, స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించడానికి వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ హబ్ రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణల రంగానికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా యువతకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. టెక్ రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే వారికి ఇది ఒక విలువైన అవకాశంగా మారనుంది.
 
ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో టెక్నాలజీ గేట్‌వేగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం టెక్నాలజీ రంగంలో ముందు వరుసలోకి రావడం ఇది మరో మైల్‌స్టోన్. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ఇప్పటికే అనేక టెక్ సంస్థలకు ఆశ్రయంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి నోరా ఫతేహీలా ఉండాలంటూ భార్య వర్కౌట్ చేయాలంటూ చిత్రహింసలు..