Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ వర్సెస్ చంద్రబాబు: నువ్వేమీ చేయలేవు.. అసలు నువ్వేమి పీకగలవు?

Advertiesment
Andhra Pradesh Assembly sessions
, సోమవారం, 30 నవంబరు 2020 (21:15 IST)
ఒకరేమో రాష్ట్రముఖ్యమంత్రి.. మరొకరేమో రాష్ట్రానికి ప్రతిపక్షనేత. వీరిద్దరు అసెంబ్లీలో సంయమనం కోల్పోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తే.. నువ్వేమీ పీకలేవ్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్నే రేపుతున్నాయి.
 
వారిద్దరు ప్రజాప్రతినిధులు. ఎలాంటి విషయాన్నయినా సంయమనంతో వ్యవహరించాలి. అదే విధంగా మాట్లాడాలి. కానీ ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ రెండు చేతులు ఊపుతూ మీరేమీ చేయలేరు అంటూ చంద్రబాబును చూస్తూ ఎగతాళి చేశారు. 
 
వరదతో రైతులు ఇబ్బందులు పడ్డారు. లక్షల హెక్టార్ల పంట కొట్టుకుపోయింది అంటూ చంద్రబాబుతో పాటు సహచర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా మీరేమీ చేయలేరంటూ చేతులెత్తుతూ సైగలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో చంద్రబాబుకు కోపమొచ్చింది. నువ్వేమి పీకుతావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
 
నేరుగా పోడియం ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది. స్పీకర్ మాటలను టిడిపి సభ్యులు పట్టించుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసేశారు. కానీ ఇద్దరు నేతల మధ్య మాత్రం జరిగిన ఈ రచ్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజు వ్యవధిలో నలుగురు మృతి