ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వైద్యులకు కలవరం మొదలైంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కఠమనేని భాస్కర్ ఇచ్చిన ఆదేశాలే కారణం. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వైద్యులందరూ అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ కచ్చితంగా వాడాలని.. దాంతోపాటు ఆస్పత్రిలోనే ఉన్నాం అని చెప్పేలా గంటగంటకీ ఓ సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చెయ్యాలని ఆదేశించారు. 
 
									
										
								
																	
	 
	ఈ ఆదేశాలే ఇప్పుడు ఏపీలోని వైద్యులకు మింగుడుపడడంలేదు. వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం సరిగా అందడంలేదని చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భాస్కర్ ఈ ఆదేశాలిచ్చారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	గంటగంటకూ సెల్ఫీ అప్‌లోడ్ చెయ్యాలి. ఆ సెల్ఫీ కూడా ఎక్కడో తీసిందికాదు.. ఆస్పత్రి ప్రాంగణం, తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లుగా చూపించేదిగా ఉండాలి. ఈ ఆదేశాలతో ఒక్కసారిగా వైద్యుల్లో దడ మొదలైంది.