Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం : మహిళా వార్డెన్‌ను కొట్టబోయిన జిల్లా ఉన్నతాధికారి.. వీడియో వైరల్

Advertiesment
victim woman
, గురువారం, 30 జూన్ 2022 (09:20 IST)
అనంతపురం జిల్లాలో హాస్టల్ సిబ్బంది బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో ఓ మహిళా వార్డెన్‌ను జిల్లా ఉన్నతాధికారి ఒకరు కొట్టేందుకు చేయి ఎత్తారు. పైగా, బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో వైరల్ అయింది. 
 
అనంతపురంలో మంగళవారం సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమశాఖల్లోని వసతిగృహాల సంక్షేమ అధికారులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఓ మహిళా సంక్షేమ అధికారిని తాడిపత్రి నుంచి కదిరికి బదిలీ చేశారు. ఆమె తనకు కళాశాలల బాలికల వసతిగృహం కాకుండా బాలికల (ప్రీమెట్రిక్‌) వసతిగృహం ఇవ్వాలని పలుసార్లు కోరారు. 
 
ఇప్పటికే పోస్టింగ్‌ ఇచ్చామని, పదే పదే విసిగిస్తున్నావంటూ సహనం కోల్పోయిన సాంఘిక సంక్షేమశాఖ సాధికారత అధికారి విశ్వమోహన్‌ రెడ్డి 'పోతావా లేదా.. ఏంది నీది? అంటూ చెయ్యి ఎత్తారు. 'పో.. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో పో' అంటూ తిట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. 
 
ఆమె భర్తను సైతం 'బుద్ధిలేనోడా.. బయటకు పో' అంటూ గద్దించారు. ఈ విషయమై అధికారి విశ్వమోహన్‌ రెడ్డిని వివరణ కోరగా కౌన్సెలింగ్‌ జరగక ముందే తనకు ఫోన్‌ చేసి విసిగించారని తెలిపారు. ఇంటికి కూడా భర్తతో కలిసి రెండుసార్లు వచ్చారని, కౌన్సెలింగ్‌ సమయంలో కదిరి వసతిగృహం కోరుకోవడంతో కేటాయించామని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్యసాయి జిల్లాలో దారుణం : 8 మంది కూలీల సజీవదహనం