Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం నుంచి ఆనందయ్య మందుకు పంపిణీ...

Advertiesment
Anandayya Ayurvedic Medicine
, సోమవారం, 7 జూన్ 2021 (08:29 IST)
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం గ్రామంలో సోమవారం నుంచి కరోనా నివారణ మందును బోనిగి ఆనందయ్య పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మందు పంపిణీని శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 
 
ఈ మేరకు ఆదివారం రాత్రి ఆనందయ్య ఓ వీడియో విడుదల చేశారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని, నియోజకవర్గంలోని పాజిటివ్‌ బాధితుల ఇంటి వద్దకే మందు చేర్చుతామన్నారు. అక్కడ పూర్తయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు. 
 
జిల్లాకు 500 ప్యాకెట్లు చొప్పున అధికార యంత్రాంగం సహకారంతో పంపిణీ చేస్తామన్నారు. అధికారుల వద్ద పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందని, సోమవారం జరిగే మందు పంపిణీలో అధికారుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని ఆనందయ్య వివరించారు. 
 
మరోవైపు, కృష్ణపట్నంలో ఆనందయ్యకు చెందిన తోటలో ఆయన సోదరుడు నాగరాజు, మరి కొంతమంది కలసి గ్రామస్థులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా బాధితులకు ఆదివారం మందు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటలో వందల మంది గుమిగూడారు. 
 
సమాచారం అందుకున్న కృష్ణపట్నం ఎస్‌ఐ స్వప్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. కరోనా నివారణలో భాగంగా నిబంధనల మేరకు 144వ సెక్షన్‌ అమలులో ఉందని, ఈ పరిస్థితుల్లో ఇంతమందిని ఒకేచోట చేర్చడమేంటని నిర్వాహకులను ప్రశ్నించారు. 
 
తక్షణం మందు పంపిణీ నిలిపివేయాలని కోరారు. మందు పంపిణీ చేస్తున్న నాగరాజును, కొంతమందిని అదుపులోకి తీసుకుని, గుమిగూడిన ప్రజలను అక్కడనుంచి పంపేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరుకు కొత్త పేరు.. పోటీపడిన నెటిజన్లు... విజేతకు హైస్పీడ్ కారు