Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు..మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు: సీఎం జగన్‌

Advertiesment
Covid treatment
, శనివారం, 25 జులై 2020 (09:25 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.
 
రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
 
క్రిటికల్‌ కేర్‌ చికిత్సకు అదనంగా 2380 బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు వెల్లడించారు.
 
వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.
 
ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు.
 
నిమ్మ ధరలపై కీలక ఆదేశం :
రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు.
 
రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27న సీఎంలతో మళ్లీ మోడీ వీడియో కాన్ఫరెన్స్!