Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెలివరీ కాగానే మహిళలకు రూ.5వేల రూపాయలు: జగన్‌

Advertiesment
డెలివరీ కాగానే మహిళలకు రూ.5వేల రూపాయలు: జగన్‌
, గురువారం, 23 జులై 2020 (17:41 IST)
అంగన్‌ వాడీలను మరింత బలోపేతం చేయాలని సీఎం  వైయస్‌.జగన్‌ ఆదేశించారు. స్కూళ్ల తరహాలోనే నాడు – నేడు కార్యక్రమాల ద్వారా 10 రకాల మౌలిక సదుపాయాలను (కిచెన్‌ షెడ్డుతో కలిపి) కల్పించాలన్నారు.

అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సేవలను రెండు రకాలుగా చూడాలని, గర్భవతులను, బాలింతలు, 36 నెలలోపు శిశువుల కార్యకలాపాలను ఒక వైపు, 36 –72 నెలలల వరకూ పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుంది

ప్రీ ప్రై మరీ–1, ప్రీ ప్రై మరీ –2 లపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రాథమిక విద్యనందిస్తున్న స్కూళ్లలోనే వీరికి బోధన ఉంటే బాగుంటుందనేది ఒక ఆలోచన అని, దీన్ని క్షుణ్నంగా పరిశీలించి ఎలా అమలు చేయాలి? ఏవిధంగా అమలు చేయాలన్నదానిపై ఆలోచనలు చేసి 7–10 రోజుల్లోగా ప్రణాళిక రూపొందించాలన్నారు. దీనివల్ల ఈ వయస్సులో ఉన్న పిల్లల చదువులు ఒకటో తరగతికి అనుసంధానం అవుతాయన్నారు. 

పీపీ–1, పీపీ–2 సిలబస్‌పైనా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. పాఠ్యప్రణాళిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే టెక్ట్స్‌ బుక్స్‌ మార్చామని, విద్యాశాఖ అధికారులతో కూర్చొని పీపీ–1, పీపీ–2 పిల్లలకు బోధనాంశాలపైనా కూడా చర్చించి, నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్‌వాడీ పిల్లల్లో లెర్నింగ్‌ స్కిల్స్‌ కోసం టూల్స్, టీవీ, ప్రత్యేక పుస్తకాలు రూపొందించాలన్నారు.

రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 20,957 కేంద్రాలు సొంత భవనాల్లో ఉన్నాయి, మరో 10,728 అంగన్‌వాడీలు అద్దెలేని భవనాల్లో ఉన్నాయి, మరో 23,922 కేంద్రాలు అద్దె భనాల్లో నడుస్తున్నాయి. భనాలు లేని కొత్త వాటి నిర్మాణం, ఉన్న భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. 
 
వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ కింద అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. అంగన్‌వాడీల్లో ఆహారం నాణ్యత ఎక్కడైనా ఒకేలా ఉండాలని, దీనికోసం స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ పాటించాలన్నారు. అంగన్‌వాడీల్లో  పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలన్నారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.

మధ్యాహ్న భోజనం పథకంకోసం పాటిస్తున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌ అన్నీకూడా ఇక్కడ పాటించేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు.  అంగన్‌వాడీలను సమర్థవంతగా నిర్వహిస్తున్న వారిని పోత్సహించాలన్నారు. సరిగ్గా నిర్వహించని అంగన్‌వాడీలపై సమాచారం ఉన్నతాధికారులకు రావాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

దీనివల్ల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. డెలివరీ కాగానే మహిళలకు రూ.5వేల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద అందించేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూములన్నీ అమ్మేస్తే, భవిష్యత్ లో నిర్మాణాలు ఎలా చేస్తారు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి