Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రాలయంలో 108 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహం నిర్మాణం

lord rama statue
, సోమవారం, 24 జులై 2023 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంత్రాలయంలో 108 అడుగులు భారీ ఎత్తున శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
 
కాగా, ఈ భారీ శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం శివారు ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. కాగా, ఈ విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. ఈ రాముడి విగ్రహం దేశంలోనే అతి ఎత్తైన విగ్రహం కానుంది.
 
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి.. 
 
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇంటి నిర్మాణానికి స్థానిక టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంతిల్లు లేదంటూ వైకాపా నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరి నోటికి తాళం వేసేందుకు ఆయన సొంతిల్లును నిర్మించాలన్ని నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఇంతకాలం తొక్కిపెట్టి, తాజాగా అనుమతి ఇచ్చారు. 
 
దీంతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో 99.77 సెంట్ల భూమిని గతంలో చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునివుంది. ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్నెల్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా, ఇన్నాళ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణంతో సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారథాన్ ‌‌పూర్తి చేసిన గంటకు బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృతి